అతనో యంగ్ హీరో. కంటెంటు, కటౌటూ.. రెండూ వున్నోడే.! ఆమె కూడా స్టార్ హీరోయిన్.! ఆ హీరోగారి కెరీర్ కాస్త స్లో అయ్యింది. హీరోయిన్ మాత్రం చాలా చాలా బిజీ. ఇద్దరి మధ్యా చాలాకాలంగా ప్రేమాయణం నడుస్తోంది.
త్వరలో పెళ్ళి పీటలెక్కుతారన్న ప్రచారం జరుగుతున్నా, ప్రతిసారీ ‘ఖండన ప్రకటనలు’ వస్తూనే వున్నాయ్. ‘అబ్బే, అదేం లేదు’ అని చెప్పీ చెప్పీ బోర్ కొట్టేసింది ఆ ప్రేమ జంటకి. ఇరు కుటుంబాల్లోనూ పెద్దగా అభ్యంతరాల్లేవ్.
స్నేహాన్ని కొనసాగిద్దాం.. ప్రేమించుకుంటూనే వుందాం.. పెళ్ళికి తొందరేముంది.? అన్న భావనలో వున్నారట. జీవితాంతం కలిసి వుండే ప్రేమేనా.? అన్న చిన్న అనుమానమైతే ఇద్దరికీ వుందా.? అంటే, ఔననే అనుకోవాలేమో.
ఇక, ఈ ఇద్దరూ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నారన్నది ఇంకోసారి తెరపైకొచ్చిన తాజా ఖబర్. ఇరువురూ తమ తమ కుటుంబ సభ్యులతో తమ ఆలోచన గురించి చర్చించారట. ‘మీ ఇష్టం మేరకే..’ అని గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందట.
‘పెళ్ళయినా సినిమాల్లో నటించడానికి ఇప్పుడు హీరోయిన్లకు పెద్దగా అభ్యంతరాల్లేవ్’. ఈ విషయంలో ఆ హీరోయిన్ మీద, ఆ హీరో అభ్యంతరాలు పెట్టే పరిస్థితీ వుండదు. సో, పెళ్ళిపై త్వరలోనే ప్రకటన రావొచ్చు. ఇంతకీ ఆ ప్రేమ జంట ఏది.? ఆ ప్రేమ పక్షులెవరు.? కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందిట.