నీ వారసత్వాన్ని కొనసాగిస్తా.. లవ్ యు నాన్న ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్!

టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ మరణించి నేటికి పది రోజులు పూర్తి అయింది.అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈయన ఈనెల 15వ తేదీ తుది శ్వాస విడిచారు.ఈ విధంగా కృష్ణ గారు మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇకపోతే కృష్ణ మరణించి పది రోజులు అవుతున్న ఇంకా మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఈ మరణ వార్త నుంచి బయటపడలేదని తెలుస్తోంది.

కృష్ణ మరణం తర్వాత మహేష్ బాబు ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు. అయితే మొదటిసారిగా తన తండ్రిని తలుచుకొని మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు కృష్ణ ఫోటోని షేర్ చేస్తూ మీ జీవితంలో మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా… ధైర్యం సాహసమే మీ వ్యక్తిత్వం అనేలా జీవించారు.

ఇలా మీ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలన్నీ కూడా మీతోనే వెళ్లిపోయాయి. ప్రస్తుతం తాను మునపటి కంటే ఎంతో ధైర్యంగా ఉన్నానని తనలో మరింత బలం చేకూరిందని మహేష్ బాబు వెల్లడించారు. మీ కాంతి ఎల్లప్పుడూ నాలో ప్రసరిస్తూనే ఉంటుందని,మునపటికన్నా ఎంతో శక్తివంతంగా తాను తయారయ్యానని తెలిపారు.ఇకపై మీ వారసత్వాన్ని ఇలాగే కొనసాగిస్తూ మీరు మరింత గర్వపడేలా చేస్తాను… మీరే నా సూపర్ స్టార్ ఐ లవ్ యు …మిస్ యు నాన్నఅంటూ మహేష్ బాబు కృష్ణ గారిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.