నేనే మీ కాళ్లకు నమస్కారం చేస్తా… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లారెన్స్!

రాఘవ లారెన్స్ ఈ పేరు తెలియని వారు ఉండరు నటుడిగా కొరియోగ్రాఫర్ గా దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలకు దర్శకుడుగా వహించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇప్పటికే లారెన్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారులకు సహాయ సహకారాలను చేస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు.ఎవరైనా కష్టంతో బాధపడుతూ ఆయన వద్దకు వెళ్తే వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి అండగా నిలుస్తుంటారు. ఇలా అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ఈయన తాజాగా ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన ఎవరికైనా సహాయం చేస్తే వారు తన కాళ్లకు నమస్కరిస్తారని అయితే ఇప్పటి నుంచి తానే ఎవరికైతే తాను సహాయం చేస్తారో వారి కాళ్లకు నమస్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈయన పోస్ట్ చేస్తూ నా జీవితంలో ఇది ఒక మార్పు ఇకపై తాను ఎవరికి సహాయం చేసిన వాళ్లు నా పాదాలపై పడకూడదని నేను భావిస్తున్నాను నేనే వారికి పాద సేవచేస్తాను అంటూ ఓ చిన్నారికి పాద నమస్కారం చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు ఇలా తనలో ఈ మార్పు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నానని నేటితో తొలి అడుగు పడిందని ఈయన తన నిర్ణయం గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈయన తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.