దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించారు. తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి హన్సిక గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెళ్లి వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఈమె తెలియజేస్తూ తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
హన్సిక తన స్నేహితుడు బిజినెస్ పార్టనర్ సోహెల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని వెల్లడించారు. ఇక ఈమె డిసెంబర్ 4వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా జరుగుతున్నాయని ఈమె వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఇకపోతే పెళ్లి తర్వాత చాలామంది నటీమణులు సినిమాలలో నటించడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత హన్సిక కూడా సినిమాలకు గుడ్ బై చెబుతారని అందరూ భావిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించినటువంటి హన్సిక పెళ్లి తర్వాత తాను సినిమాలకు దూరం కానని అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఈమె వెల్లడించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలని నియమ నిబంధనలు తాను పెట్టుకోలేదని, మనం చేసే ఏ పని అయినా కూడా ఎంతో విలువైనది అంటూ ఈ సందర్భంగా హన్సిక కామెంట్స్ చేయడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు