కేజిఎఫ్ చాప్టర్ 3 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో యశ్.. ఏమన్నారంటే?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన చిత్రం కే జి ఎఫ్.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో చాప్టర్ 3 కూడా ఉండబోతుందనీ హింట్ ఇవ్వడంతో చాప్టర్ 3 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా చాప్టర్ 3 తప్పకుండా ఉంటుందని చిత్రబృందం కూడా వెల్లడించారు. అయితే ఈ సినిమా రావడం కాస్త ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 3 పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇకపోతే శనివారం ముంబైలో జరిగినటువంటి ఇండియా టూడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ పై స్పందించారు యశ్. కే జి ఎఫ్ సిరీస్ లను ఎంతగానో ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రస్తుతం చాలామంది ఈ సినిమా చాప్టర్ 3 గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కే జి ఎఫ్ 3 గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి వచ్చే వార్తలను ఎవరు నమ్మకండి ఈ వార్తలలో ఏ విధమైనటువంటి వాస్తవం లేదు. ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తే తానే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటానని తెలియజేశారు. కే జి ఎఫ్ చాప్టర్ 3 చేయాల్సి వస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా యశ్ వెల్లడించారు.