ఐ మిస్ యు నాన్న.. కృష్ణని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన మంజుల?

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఇలా ఈయన మరణం అందరిని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. కృష్ణ కళామతల్లి నుంచి సెలవు తీసుకొని కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. కృష్ణ మరణ వార్త తెలియగానే ఎంతోమంది సినీ ప్రముఖులు అభిమానులు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడమే కాకుండా తనతో వారికి ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణ కుమార్తె మంజుల సైతం తన తండ్రి మరణం పట్ల ఎమోషనల్ అవుతూ తన తండ్రి గురించి తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మంజుల స్పందిస్తూ నాన్న ఈ ప్రపంచానికి మీరు సూపర్ స్టార్. మీరు మాకు అందించిన ప్రేమ చిరకాలం గుర్తిండిపోతుంది. మీరు మా జీవితాలకు సూపర్ స్టార్.. మిస్ యు నాన్న లవ్ యు సో మచ్ అంటూ కృష్ణ గారి గురించి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం మంజుల చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం కృష్ణ గారి పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు మరి కాసేపట్లో పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రస్థానం వరకు ఈయన అంతిమయాత్ర కొనసాగి అక్కడ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇకపోతే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ విదేశాలలో చదువుతున్న సంగతి తెలిసిందే. అయితే తాతయ్య చివరిసారి చూడటం కోసం గౌతం కూడా విదేశాల నుంచి ఇండియాకు చేరుకొని తన తాతయ్యని చూస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.