Renu Desai: టాలీవుడ్ ప్రముఖ నటి హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంలో కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటారు రేణు దేశాయ్. అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అందరి మన్నలను పొందుతూ ఉంటారు.
మహిళలు చిన్నపిల్లలు, ఆపదలో ఉన్న వారి కోసం తన వంతు సహాయం చేసి ఎదుటివారిని కూడా సహాయం చేయమని కోరుతూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జరిగే కొన్ని సంఘటనలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు రేణు దేశాయ్. మూగజీవాలపై జరిగే హింసాత్మక వీడియోల గురించి ఎక్కువగా స్పందిస్తూ ఉంటారని చెప్పాలి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన రేణు దేశాయ్ అభిమానులను సహాయం చేయమంటూ రిక్వెస్ట్ చేసింది. అసలేం జరిగిందంటే.. ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఆమె ఇలా రాసుకొచ్చింది.
విజయవాడలో ఉంటున్న నా మంచి ప్రజలారా ప్రతి ఒక్కరూ దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి. రవి గారికి విరాళం ఇవ్వండి.. మీరు నా ఎన్జీవోకి విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి జంతు సంఘానికి ఖచ్చితంగా విరాళం ఇవ్వండి అంటూ దండం పెట్టే ఎమోజిని జోడించి రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా ఇలా ఆమె జంతువుల సంరక్షణ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం చేసి, ఎదుటివారిని కూడా సహాయం చేయమని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. ఇలా ఒకరికి మంచి జరగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.