నాకు జనాలకు చెప్పేంత జ్ఞానం లేదు.. కృష్ణ వంశీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల ద్వారా అగ్ర దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో చివరిసారిగా నక్షత్రం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈయన రంగమార్తాండ అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణవంశీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం గురించి మాట్లాడారు.పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమాని విజయ్ దేవరకొండతో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి మాట్లాడుతూ… తాను కూడా ఎప్పటికైనా వందేమాతరం డ్రీం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ఈయన వెల్లడించారు. పూరి జగన్నాథ్ ప్రస్తావన రావడంతో ఆయన పూరి మ్యూజింగ్స్ పేరుతో చిన్నచిన్న ఆడియో క్లిప్స్ విడుదల చేస్తూ ఉంటారు వాటిని ఎప్పుడైనా విన్నారా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానం చెబుతూ వాటిని విన్నాను కానీ తాను అలా చెప్పలేనని వెల్లడించారు. అలాంటి మాటలను చెప్పడానికి నాకు అంత జ్ఞానం ఉందని నేను అనుకోవడం లేదు. ఇలా మాటల ద్వారా జనాలకు చెప్పే అంత జ్ఞానం నాకు లేదు కానీ నేను ఏదైనా చెప్పాలనుకున్న సినిమాల ద్వారా చెబుతానని ఈ సందర్భంగా కృష్ణవంశీ పూరి జగన్నాథ్ తో పోలుస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే పూరీ జగన్నాథ్ కృష్ణవంశీ ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే వీరిద్దరూ కూడా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసే అనంతరం డైరెక్టర్లుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.