జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో.. ప్రారంభం అయి 7 ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ షోకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కామెడీ షో పేరుతో వచ్చిన మొట్టమొదటి షో కూడా జబర్దస్తే. రావడం రావడమే సూపర్ సక్సెస్ అవడమే కాకుండా.. అప్పటి నుంచి ఇప్పటికీ దానికి ఉన్నా పాపులారిటీని అలాగే మెయిన్ టెన్ చేసుకుంటూ రావడం అనేది చిన్న విషయం కాదు. తెలుగులో ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. జబర్దస్త్ తర్వాతనే అని ఎన్నోసార్లు రుజువు కూడా అయింది.
జబర్దస్త్ ను చూసి చాలా చానెళ్లు చేయి కాల్చుకున్నాయి కానీ.. ఏ చానెల్ తమ షోను సక్సెస్ చేసుకోలేకపోయాయి. ఇటీవల జీ తెలుగులో అదిరింది పేరుతో ఓ కామెడీ షో ప్రారంభం అయింది. దానికి నాగబాబు జడ్జ్ అయినప్పటికీ.. జబర్దస్త్ లో కామెడీ చేసిన వాళ్లలో సగం మంది అటు వెళ్లినప్పటికీ.. ఆ షో సక్సెస్ కాలేకపోయింది. అంతే కాదు.. ఆ షో సక్సెస్ కాలేదని బొమ్మ అదిరింది అనే పేరు పెట్టి.. ఇంకాస్త కామెడీ డోస్ పెంచారు. అయినా ఫలితం లేదు.
సరే.. అసలు విషయానికి వస్తే.. నిజానికి జబర్దస్త్ లో స్కిట్లు చేసే వాళ్లకు రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది. వాళ్లకు స్కిట్ కు ఇంత అని ఇస్తారా? లేక నెల నెల జీతం ఇస్తారా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది.
నిజానికి.. ప్రస్తుతం జబర్దస్త్ అంటే హైపర్ ఆది.. హైపర్ ఆది అంటే జబర్దస్త్. హైపర్ ఆది స్కిట్ కు ఎంత పాపులారిటీ ఉంటుందో అందరికీ తెలుసు. హైపర్ ఆది తర్వాత సుడిగాలి సుధీర్ స్కిట్ కు అంతే డిమాండ్ ఉంటుంది.
అయితే.. హైపర్ ఆదికి మల్లెమాల వాళ్లు నెలనెలా జీతం ఇస్తారట. నెలకు 3 లక్షల రూపాయల జీతం ఇస్తారట. సుడిగాలి సుధీర్ కు మాత్రం నెలకు 4 లక్షలు ఇస్తారట. అయితే.. జబర్దస్త్ లో అందరికీ జీతాలు ఇవ్వరట. ఫేమస్ అయిన వాళ్లకే జీతాలు ఇస్తారట. మిగితా వాళ్లకు స్కిట్ వైజ్ పేమెంట్ ఉంటుందట.
నిజానికి జబర్దస్త్ లో హైపర్ ఆదికే ఎక్కువ పేమెంట్ రావాలి కానీ.. ఆయన సుడిగాలి సుధీర్ కన్నా జూనియర్ కావడంతో సుధీర్ కన్నా తక్కువ ఇస్తున్నారట. కొన్ని రోజుల తర్వాత హైపర్ ఆదికే ఎక్కువ పేమెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇక.. తమ అందాలు ఆరబోసే యాంకర్ అనసూయకు 4 లక్షలు, రష్మీకి 3 లక్షలు ఇస్తున్నారట. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న కొందరు కంటెస్టెంట్లకు మాత్రం 2 నుంచి 2.5 లక్షలు ఇస్తున్నారట.