సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో ఎవ్వరికీ తెలియదు. సినీ పరిశ్రమ పేరు చెప్పి చేసే మోసాలు, జరిగే ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీల పేర్లు చెప్పి మోసం చేసే వారే ఎక్కువ మంది ఉంటారు. సెలెబ్రిటీలతో ఫోటోలు దిగి.. వారు కూడా సెలెబ్రిటీలన్నట్టుగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో పరిచయాలున్నాయని చెబుతూ అమయాకుల దగ్గర డబ్బులు గుంజుతుంటారు.
హైపర్ ఆది కూడా అలాంటి వారి బుట్టలోనే పడ్డాట. కెరీర్ ప్రారంభంలో హైపర్ ఆది అలా చాలా మోసపోయాడట. సెలెబ్రిటీలతో ఫోటోలు దిగి పెట్టిన ఒకరితో పరిచయం పెంచుకున్నాడట. ఇండస్ట్రీలో అవకాశం ఇప్పిస్తానని చెబుతూ డబ్బులు అడిగేవాడట. వంద రూపాయలు రీచార్జ్ చేయమని వాడని, అలా చేసే వాడినికూడా అని ఆది చెప్పుకొచ్చాడు. ఇక ఒకసారి ఐదు వేలు అడిగితే కూడా ఇచ్చానని చెప్పాడు.
ఒకసారి ఏదో ఒక ఆఫీస్‌కు కూడా వెళ్లాను.. పక్కన అమ్మాయి లవర్‌గా నటిస్తుందని, మంచి రోల్ రేపటి నుంచి షూటింగ్.. ఇక్కడి నుంచే పికప్ చేసుకుంటామని చెప్పారట. కాకపోతే పది వేలు కట్టాల్సి ఉంటుందని అన్నారట. అయినా సరే అని పది వేలు కట్టాడట. కానీ తెల్లారి వెళ్లి చూస్తే అక్కడ ఆఫీస్‌కు తాళం వేసి ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా కొందరి చేతుల్లో మోసపోయానని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.