భారీ నిడివితో రాబోతున్న “ఆదిపురుష్”..ఫైనల్ రన్ టైం ఇదే.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉంది అంటే అది “ఆదిపురుష్” అనే చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా సినిమాలు కన్నా ఇది అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకునే పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాగా అయితే ఇప్పుడు రాబోతుంది అని చెప్పడంలో  లేదు.

కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రామునిగా, కృతి సనన్ జానకి దేవిగా నటించారు. అయితే ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కింది అని అందరికీ తెలిసిందే. అలాగే రామాయణం అంటే ఓ మహా అధ్యాయం అని కూడా అందరికీ తెలుసు. మరి దీనిని ఎంత తక్కువ రన్ టైం లో చెపుదాం అన్నా కుదిరే పని కాదు.

మరి అలా ఇప్పుడు ఈ రామాయణం అయితే మొత్తంగా భారీ రన్ టైం వచ్చినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. లేటెస్ట్ గా ఓవర్సీస్ ప్రింట్ ప్రకారం అయితే ఈ సినిమా ఫైనల్ రన్ టైం గా 2 గంటల 54 నిముషాలు వచ్చిందట. అంటే మొత్తం 174 నిముషాలు వచ్చింది.

మరి రీసెంట్ టైం లో ఆల్ మోస్ట్ అన్ని పాన్ ఇండియా భారీ సినిమాలు ఇదే తరహా రన్ టైం లో ఇంకా ఎక్కువ నిడివితో కూడా వచ్చాయి. సో ఈ చిత్రానికి కూడా భారీ హిట్ రిజల్ట్ దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే ఈ జూన్ 16న గ్రాండ్ గా అన్ని భాషల్లో 2డి, 3డి మరియు 4డి ఎక్స్ ఫార్మాట్ లో అయితే రిలీజ్ కాబోతుంది.