“సలార్” ఆడియో కోసం ఈ రెండు సంస్థలు భారీ పోటీ?

పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కన్నా ముందు మరో సినిమా “ఆదిపురుష్” రిలీజ్ తో ప్రభాస్ సిద్ధంగా ఉండగా దీనితోనే సలార్ నుంచి మాసివ్ ట్రీట్ ని థియేటర్స్ లో ఇవ్వనున్నాడని కూడా ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ ఉంది.

కాగా ఈ భారీ చిత్రంపై అయితే మరో క్రేజీ న్యూస్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది. “సలార్” ఆడియో హక్కులు కోసం అయితే ఇప్పుడు భారీ పోటీ సినీ వర్గాల్లో నడుస్తుందట. సౌత్ సహా ఇండియా సినిమా మ్యూజిక్ లో బడా సంస్థలు అయ్యిన సోనీ మ్యూజిక్ మరియు లహరి మ్యూజిక్ వారు ఐతే సలార్ ఆడియో కోసం పోటీ పడుతున్నట్టుగా ఇప్పుడు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సలార్ హక్కులకు భారీ పోటీ నెలకొంది. మరి ఆడియో రైట్స్ అయితే ఇంతకీ ఎంతకి అమ్ముడు పోతాయో చూడాలి. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, మళయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ అలాగే ఇతర భారీ తారాగణం పాన్ ఇండియా వైడ్ అయితే ఈ సినిమాలో నటిస్తున్నారట. అలాగే కేజీఎఫ్ టీం వారే ఈ సినిమాకి వర్క్ చేస్తుండగా ఆ నిర్మాణ సంస్థే హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.