జీసస్ ఎవరికి ఎలా పుట్టారు… మరో వివాదాస్పద ట్వీట్ చేసిన పూనమ్?

సాధారణంగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్ లు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. సమయం సందర్భం లేకుండా చేసే ట్వీట్స్ కారణంగా పెద్ద వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకోవడం కన్నా ఇలా సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు నటి పూనమ్ కౌర్. ఇలా ఈమె నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఎన్నో వివాదాలను సృష్టించిన పూనమ్ తాజాగా మరొక ట్వీట్ ద్వారా కుల మతాల మధ్య చిచ్చురేపారు. ఈ సందర్భంగా ఈమె అందరికీ క్షమాపణలు చెబుతూనే తన ట్వీట్ వేశారు. దేవుళ్ళ విషయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.. జీసస్ ఎవరికి పుట్టారు? ఎలా పుట్టారు? అంటూ ఈమె ప్రశ్న వేశారు. ఈ విధంగా ఈమె ప్రశ్నిస్తూ తప్పుగా అనుకోవద్దు నాకు నిజంగానే అంత తెలియదు నేను అంతగా చదువుకోలేదు అంటూ ఈమె ఈ ప్రశ్న వేశారు.

ఇలా ఈమె జీసస్ గురించి ప్రశ్నించడంతో ఒక్కసారిగా క్రిస్టియన్స్ భగ్గుమంటున్నారు.మామూలుగానే ఈ ప్రశ్నను మనం అడిగితే క్రిస్టియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అలాంటిది ఈమె సోషల్ మీడియా వేదికగా అడగడంతో అసలు ఇదేం ప్రశ్న అంటూ ఎంతోమంది నేటిజెన్లు ఈమె వ్యవహార శైలిని పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇక జీసస్ గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేస్తూ కుల మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా పూనమ్ ఎలాంటి ట్వీట్ వేసిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుందని చెప్పాలి.