Manchu Vishnu: మూవీ 5 సార్లు చూస్తా.. ప్రభాస్ లుక్ తేడా రాకుండా చూస్కో.. విష్ణుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నెటిజన్!

Manchu Vishnu: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలు వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు పరస్పర దాడులు కూడా చేసుకున్నారు. నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయం బజారున పడడంతో పాటు మీడియా ముందు, పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది.

ఈ గొడవల కారణంగా మంచు విష్ణు కన్నప్ప మూవీ సైడ్ అయిపోయింది. ఈ గొడవల కారణంగా ఎక్కడ ఈ సినిమాని పట్టించుకోకుండా ఉంటారేమో అన్న అభిప్రాయంతో ఒక నెటిజన్ మంచు విష్ణు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దానికి మంచి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చారు. ఈ భక్త కన్నప్ప మూవీ లో ప్రభాస్ అతిథి పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై నెటిజన్ స్పందిస్తూ విష్ణుని ట్యాగ్ చేస్తూ.. అన్నా మూవీ ఎలా ఉన్నా పర్లేదు.. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూసుకో.. ఐదుసార్లు మూవీ కి వెళ్తాను అని రాసుకొచ్చాడు. సదరు నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంచు విష్ణు స్పందిస్తూ.. 100% మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్.

 

కాస్త ఓపికగా ఉండు త్వరలోనే బోలెడన్ని విషయాలు చెబుతాను అని రాసుకొచ్చాడు విష్ణు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప్ప మూవీలో విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు,కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ ఇలా భారీ తారాగణం ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్, అలాగే సినిమా నుంచి పలు పోస్టర్లను కూడా విడుదల చేశారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.