టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నటి పూనమ్ కౌర్ మరోసారి ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద టాలీవుడ్ మా అసోసియేషన్ లో ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను. అయితే ఎవరూ కూడా త్రివిక్రమ్ ను ప్రశ్నించలేదు. కనీసం యాక్షన్ కూడా తీసుకోలేదు. నా జీవితాన్ని అన్ని రకాలుగా త్రివిక్రమ్ నాశనం చేశాడు. అయితే అలాంటి వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పూర్తిగా నాశనం చేశాడు” అంటూ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.
ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా పూనమ్ కౌర్ ట్వీట్ పై స్పందించిన మా అసోసియేషన్ కోశాధికారి శివబాలాజీ రిప్లై ఇచ్చారు. పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదని, పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఉపయోగం లేదని స్పష్టం చేశారు.
మా అసోసియేషన్ ను కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ వివాదంపై గతంలోనూ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంలో టాలీవుడ్ మిగతా చిత్ర పరిశ్రమల కంటే ఎంతో ముందుందని, వర్క్ ప్లేస్ లో అమ్మాయిలకు వేధింపులు ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దవారినైనా మేము విచారిస్తాం అన్నారు. పూనమ్ కౌర్ కమిటీలో రిపోర్ట్ చేయకుండా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపయోగం లేదని వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.
శివ బాలాజీ ట్వీట్ పై పోను ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.పూనమ్ కౌర్ తెలుగు సినిమాలతో పాటు తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది