కోట్ల మందికి కనిపంచని మహేష్ పుట్టుమచ్చ బిగ్ బాస్ బ్యూటీకి ఎలా కనిపించిందబ్బా ..?

దివి విద్య.. ఈ పేరు వింటే ఎవరు పెద్దగా గుర్తు పట్టక్పోవచ్చు. కాని బిగ్ బాస్ దివి అంటే మాత్రం ఒక అందమైన అమ్మాయి కళ్ళ ముందు మెదలుతుంది. సీజన్ 4 లో నాగార్జున నే తన ఎంట్రీ సాంగ్ తో ఆకట్టుకున్న ఫస్ట్ ఎపిసోడ్ అందరికీ గుర్తొస్తుంది. అంతేకాదు హౌజ్ లో అందరికంటే పెద్దావిడ అయిన గంగవ్వ ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రాత్రిళ్ళు కాళ్ళు పడుతూ సొంత అమ్మమ్మని చూసుకున్నట్టుగా దివి సేవలు చేసి బయట ప్రేక్షకులనే కాదు కింగ్ నాగార్జున మనసుని గెలుచుకుంది.

divi vadthya sizzling intro bigg boss telugu 4

ఈ సీజన్ లో ఉన్న వాళ్ళలో దివి చాలా హాట్ గా ఉంటుంది. ప్రేక్షకులను అన్ని విధాల ఎంటర్‌టైన్ చేస్తోంది. చెప్పాలంటే దివి వెబ్ సిరీస్ లలో నటించినప్పుడు కూడా రాని పాపులారిటీ బిగ్ బాస్ లో పాల్గొంటున్నప్పటి నుంచి విపరీతంగా వచ్చేసింది. అంతేకాదు దివి మోడలింగ్ రంగం లోను రాణిస్తోంది. హైదరాబాది అయిన దివి కి హీరోయిన్ గా అవకాశాలు వస్తే చేయాలన్న ఆసక్తిని చూపిస్తుంది. హౌజ్ నుంచి బయటకి వచ్చాక ఆ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు.

బిగ్ బాస్ పార్టిసిపెంట్ 'దివి' మహర్షి సినిమాలో ఎక్కడుందో తెలుసా..? - Pakka  Filmy - Telugu

ఈ బిగ్ బాస్ బ్యూటి సూపర్ స్టార్ మహేష్ బాబు కి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ని రివీల్ చేసింది. ఇన్నాళ్ళు ఈ విషయం కోట్ల మంది అభిమానులకి కూడా తెలియని విషయం చెప్పి షాకిచ్చింది. దివి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న రోల్ చేసింది. ఒక సీన్ లో ఇద్దరు కలిసి కనిపించే షాట్ షూట్ చేస్తున్న సమయంలో గాలికి మహేష్ హేయిర్ కదిలి నుదుటి మీద ఉన్న పుట్టు మచ్చని చూసి ఎగ్జైట్ అయిందట. చూడటానికి సూపర్ గా ఉందని మహేష్ తో కూడా చెప్పగా తన కూతురు సితార కి అదే ప్లేస్ లో పుట్టు మచ్చ ఉందని మహేష్ చెప్పాడట. మొత్తానికి దివి సూపర్ స్టార్ కి సంబంధించిన సీక్రెట్ అందరికి తెలిసేలా చేసింది.