అల్లరి నరేష్ ఉగ్రం రిలీజ్ డేట్ ఫిక్స్

నాంది సినిమాతో అల్లరి నరేష్ తన కథల ఎంపిక విధానం పూర్తిగా మార్చుకున్నాడు. గతంలో ఎక్కువగా కామెడీ అండ్ ఎంటర్టైనర్ కథలని మాత్రమే చేసిన నరేష్ వాటితో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో సుదీర్ఘ కాలం ఫ్లాప్ తో కెరియర్ కొనసాగించాడు. అయితే మహర్షి సినిమాలో నరేష్ సీరియస్ రోల్ లో కనిపించాడు. ఆ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో మళ్ళీ అలాంటి సీరియస్ క్యారెక్టరైజేషన్ లోనే నాంది సినిమా చేశాడు.

విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అల్లరి నరేష్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా ఉత్సాహంతో ఇటు మారేడుమల్లి ప్రజానీకం అనే సినిమా చేశాడు. అయితే కంటెంట్ బాగుందనే టాక్ వచ్చిన ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే మళ్ళీ తనకి నాంది లాంటి సక్సెస్ ఇచ్చిన విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలోనే ఉగ్రం సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. యాక్షన్, డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని సాహు గారపాటి నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కి ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. షూటింగ్ చివరిదశకి వచ్చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అల్లరి నరేష్ భావిస్తున్నారు.

ఇక నాంది లాంటి హిట్ తర్వాత మరల వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా అంచనాలు ఉంటాయి. మరి ఆ అంచనాలని అందుకోవడంలో దర్శకుడు ఏ మేరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. ఇక డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్న నరేష్ నుంచి మళ్ళీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ వస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే సీరియస్ కథలని ఎడాప్ట్ చేసుకున్న నరేష్ మళ్ళీ ఇటు వైపు వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తుంది.