ఆ యంగ్ హీరోకి పూజా హెగ్దే నో చెప్పిందట.!

బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించడమే కాదండోయ్.. స్పెషల్ సాంగ్స్‌తోనూ కేక పుట్టిస్తోంది. రామ్ చరణ్ సరసన ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేల్ రాణి..’ అంటూ స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడింది. ఆ పాట సూపర్ డూపర్ హిట్టు.

అలాగే, ‘ఎఫ్ 3’ లో వెంకటేష్, వరుణ్ తేజ్‌ల సరసన కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడింది. దాంతో, ఓ యంగ్ హీరో తన సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ వుండాలని డిమాండ్ చేశాడట.

దాంతో, మేకర్లు పూజా హెగ్దేని సంప్రదించగా.. సింపుల్‌గా పూజా నో చెప్పేసిందట. పూజా హెగ్దే ఎందుకలా నో అనేసిందో తెలీదు కానీ, ఆ యంగ్ హీరో మాత్రం చాలా హర్టవుతున్నాడట.

అందరికీ బాగా తెలిసిన యంగ్ హీరో అనీ తెలుస్తోంది. ఇదో మాస్ సినిమా అట. ఇందులో అదిరిపోయే స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట. ఆ సాంగ్ కోసమే పూజా హెగ్దేని స్పెషల్‌గా అప్రోచ్ కాగా, పూజా నో చెప్పేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.? ఎవరా యంగ్ హీరో.? అనేది తెలియాల్సి వుంది.