పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన వంశీ.!

పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా వున్నా, ఆయన కోసం కథలు అల్లడానికి దర్శకులు మాత్రం వెనుకాడడం లేదు. కొత్త కొత్త కథలతో, కాన్సెప్టులతో పవన్ కళ్యాణ్‌ని సంప్రదిస్తూనే వున్నారు.

తాజాగా వంశీ పైడిపల్లి, పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ఆల్రెడీ పవన్‌కి వినిపించాడనీ సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా.? లేదా.? అన్నది తెలియాల్సి వుంది. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంత బిజీనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో తలమునకలై వున్నాడు.

మరో వైపు రాబోయే ఎలక్షన్ల నిమిత్తం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో మరింత బిజీగా వున్నాడు. ఈ తరుణంలో మళ్లీ కొత్త సినిమాలా.? ఎన్ని సినిమాలని చేస్తాడు..? అయితే, వక్కంతం వంశీ చెప్పిన కథ పవన్‌కి బాగా సూటవుతుందని అంటున్నారు. నిజానికి వంశీ తాజా మూవీ ‘వారసుడు’ సైతం పవన్ కళ్యాణ్‌ని దృస్టిలో పెట్టుకుని తీసిన సినిమానే అనే ప్రచారం కూడా సాగింది.

వారసుడు రిలీజ్‌కి ముందు రిలీజ్ చేసిన పోస్టర్లలో కొన్ని పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు కనిపించాయన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.