Allu Ayaan: నిన్నటి రోజున ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ గురించి మార్చారు కోవడంతో పాటు ఆ విషయం గురించే చర్చలు కూడా జరిగాయి. ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫోటోలు ట్వీట్లు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్ కి ఇండియాలో ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ లో అత్యంత బలమైన ప్రాంఛైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి. గతంలో ఈ జట్టు తరపున వరల్డ్ క్లాస్ టి20 ప్లేయర్స్ క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి వారు ప్రాతినిధ్యం వహించారు. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 18 ఏళ్లుగా ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది కలగానే మిగులుతూ వచ్చింది.
ఐపీఎల్ ప్రారంభం అయిన ప్రతిసారీ ఆర్సీబీ జట్టు ఈసారైనా కప్పు గెలుస్తుందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోలింగ్ మొదలవుతాయి. కానీ ఈసారి మాత్రం ఆర్సీబీ జట్టు పట్టు వదల్లేదు. 18 ఏళ్ళ కలని సాకారం చేసుకుంటూ ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఫైనల్ లో విజయం సాధించిన తర్వాత కోహ్లీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఇది నిజంగా గూస్ బంప్స్ తెప్పించే విషయం అని చెప్పాలి. ఇకపోతే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ విషయాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు పేలుస్తూ కేరింతలు కొడుతూ కేక్స్ కట్ చేసి బైక్ రైడ్స్ చేస్తూ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ ఆనందంలో మునిగిపోయారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా ఆర్సీబీ విజయాన్ని క్రేజీగా కాస్త ఎమోషనల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆర్సిబి విజయం సాధించిన తర్వాత అల్లుడు అయాన్ రియాక్షన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు అర్జున్. ఆ వీడియోలో అల్లు అయాన్ చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు. ఆర్సీబీ విజయం సాధించగానే అయాన్ ఇంట్లో నేలపై పడుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత సంతోషంతో టీవీ ముందే బాటిల్ లో ఉన్న నీళ్ళని తలపై పోసుకున్నాడు. ఈ వీడియోలో అల్లు అర్జున్, అయాన్ తండ్రీకొడుకుల సంభాషణ కూడా వినవచ్చు. నాకు కోహ్లీ అంటే ఇష్టం. కోహ్లీ వల్లే క్రికెట్ పై అభిమానం ఏర్పడింది అని అల్లు అయాన్ అంటున్నాడు. నీ ముఖం వెలిగిపోతోంది అంటూ బన్నీ.. అయాన్ బుగ్గలని ప్రేమగా గిల్లడం చూడవచ్చు. అయితే ఆర్సీబీ గెలిచిన ఆనందంలో కొడుకు అలా ప్రవర్తించడం చూసి అల్లు అర్జున్ కూడా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేయడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.