Rishabh Pant: సిక్స్ తో సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్.. ధోనీ రికార్డ్ బ్రేక్..!

ఇంగ్లాండ్ పర్యటనలో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో… భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయ్యింది.
భారత్ బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన చేసింది. తొలి రోజున యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీలతో మెరిశారు. ఇక రెండో రోజు మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌పై భారత్ ఆధిపత్యాన్ని చూపాడు.

99 పరుగుల వద్ద ఉన్న సమయంలో భారీ సిక్సర్ తో తన శతకాన్ని పూర్తి చేసిన పంత్, అభిమానుల్ని అలరించాడు. మొత్తం 146 బంతులు ఆడి 105 పరుగులు చేసిన పంత్ తన ఇన్నింగ్స్‌లో 10 బౌండరీలు, 4 సిక్సర్లు బాది, 71.92 స్ట్రైక్ రేటుతో ఆటను రచ్చ చేశాడు. అంతేకాదు.. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా భారత తరఫున అత్యధిక శతకాల రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

రిషబ్ పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 శతకాలు సాధించాడు.. దీంతో MS ధోనీ (6 సెంచరీలు) రికార్డును బ్రేక్ చేశాడు. మూడో స్థానంలో వృద్ధిమాన్ సాహా మూడు శతకాలతో ఉన్నాడు. శతకం సాధించిన తర్వాత పంత్ 134 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్ టంగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.