టెస్ట్ ఫార్మాట్ ఇప్పుడు ఖచ్చితంగా క్రికెట్ ప్రేమికుల కళ్లలో కొత్త వెలుగు చూస్తోంది. ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయం దీనికి నిదర్శనంగా నిలిచింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించి ప్రైజ్‌మనీని నొక్కిచెప్పాల్సిందే.. గత సారి కంటే రెండింతలు! అంటే ఈసారి టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా రూ.30 కోట్లకుపైగా బహుమతి. ఓడిన జట్టుకీ రూ.18 కోట్ల దాకా రివార్డు.
ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, టెస్ట్ క్రికెట్‌కు తిరిగి మద్ధతు లభిస్తున్న సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఇక మ్యాచ్‌ను అర్థం చేసుకోవాలంటే ఫైనల్‌కి అర్హత సాధించిన జట్ల ప్రస్థానం చూద్దాం. దక్షిణాఫ్రికా జట్టు ఈ సీజన్ మొత్తంలో క్రమశిక్షణతో ఆడింది. శ్రీలంక, పాకిస్థాన్‌లపై సిరీస్‌లు గెలిచింది. ఫలితంగా 69.44 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఇక గత చాంపియన్ ఆస్ట్రేలియా మాత్రం తక్కువ తేడాతో రెండో స్థానం దక్కించుకుంది. భారత్ మాత్రం ఈసారి టైటిల్ రేసులోంచి వెనక్కి పడిపోయింది. అయినా టెస్ట్ క్రికెట్‌కు లభిస్తున్న స్పందన చూసి ఐసీసీ ఖుషీ అయింది. ఇదంతా జరుగుతున్న వేదిక మాత్రం క్రికెట్‌కు ప్రాణం లాంటి లార్డ్స్ స్టేడియమే. జూన్ 11న జరిగే ఫైనల్ కోసం ఇప్పటివుండే క్రికెట్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ గట్టిగానే చెప్పారు. ఇది రెండు సంవత్సరాల కృషికి ప్రతిఫలం. టెస్టుల ఆత్మను మళ్లీ చిగురించేందుకు ఇదే సరైన అవకాశం. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా కూడా అదే స్థాయిలో ఉత్సాహం చూపిస్తూ, తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. జూన్ 11న ఎవరూ ఊహించని స్కోర్‌లతో, సంచలన ఒరవడితో ఈ ఫైనల్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక పేజీగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.