ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఎలా ఉన్నా… ఆటగాళ్లు చూపించే హృదయపూర్వక హావభావాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన ఓ చిన్న నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. భారత్‌ను ప్రేమగా చూసే విదేశీ క్రికెటర్లలో కమిన్స్ ముందుంటాడని ఇప్పటికే క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ఇప్పుడు ఆయన చేసిన అభినందన స్టోరీతో ఆ మాటలు మరోసారి నిజమయ్యాయి. బీసీసీఐ రూపొందించిన ఓ పోస్టర్.. ఐపీఎల్ కెప్టెన్లు భారత సాయుధ దళాలకు నివాళులర్పిస్తున్న దృశ్యం – ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే పోస్టర్‌ను కమిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేస్తూ, “భారత ఆర్మీ చూపిన ధైర్యం ప్రేరణ కలిగించే విషయం. కృతజ్ఞతలు” అంటూ ఆర్మీకి సెల్యూట్ చేశాడు.
ఈ స్టోరీని చూసిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్య సభ్యురాలు కావ్య మారన్ ఫిదా అయిపోయారు. తన ఎక్స్ హ్యాండిల్‌లో “ఆరెంజ్ ఆర్మీ నీపై గర్వంగా ఉంది” అంటూ పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమిన్స్ వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జట్టు ఫలితాలపై నిరాశలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు కూడా కమిన్స్ హృదయాన్ని మెచ్చుకుంటున్నారు.
మ్యాచ్‌ల పరంగా ఈ సీజన్ సన్‌రైజర్స్‌కి అనుకూలించకపోయినా, కమిన్స్ లీడర్‌గా చూపిస్తున్న బాధ్యతాభావం మాత్రం ప్రశంసనీయం. మైదానంలో ఆట ఎంత ముఖ్యమైతే, మైదానం బయట మనిషిగా ఎదగడం కూడా అంతే విలువైనదని ఆయన చూపిస్తున్నారు.