మెగాస్టార్ ‘లూసిఫర్’ : నయన్ అవుట్ .. త్రిష ఇన్ !

మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన `లూసిఫర్` సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. మలయాళంలో ఆ పాత్రను ప్రముఖ నటి మంజు వారియర్ పోషించారు. ముఖ్యమంత్రి కూతురిగా హుందాగా ఉంటూనే ఎన్నో భావాలను అవలీలగా పలికించారు.

Image result for nayanthara , trisha

దీనితో ఆ పాత్ర కి ఓ దశలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత నయనతార పేరు తెర మీదకు వచ్చింది. నయన్ కన్ఫామ్ అని కూడా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి సోదరిగా కనిపించడానికి నయన్ అంగీకరించలేదట. ప్రస్తుతానికి హీరోయిన్‌గా బిజీగా ఉన్న తను సోదరి పాత్రలు చేయకూడదని నయన్ భావిస్తోందట. చెల్లి పాత్రలు చేసేందుకు సిద్ధంగా లేని నయనతార కథ నచ్చినా లూసిఫర్ రీమేక్‌కు నో చెప్పిందట.

దీంతో చిత్రబృందం త్రిషను సంప్రదించింది. ఆ రోల్ చేసేందుకు త్రిష అంగీకరించినట్టు సమాచారం అందింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. గతంలో చిరంజీవి, త్రిష `స్టాలిన్` సినిమాలో జంటగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న `ఆచార్య`లో హీరోయిన్‌గా ముందుగా త్రిషనే ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది.