ఇండస్ట్రీ టాక్ : మెగాస్టార్ కోసం విశ్వ సుందరి??

ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ అంతా కూడా మళ్ళీ భారీ హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తున్నారు. మరి ఈ చిత్రాల్లో అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ హిట్ వాల్తేరు వీరయ్య తో గ్రాండ్ హిట్ అందుకోగా దీని తర్వాత భోళా శంకర్ తో బోల్తా పడ్డారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం డిజాస్టర్ తో ఇక రీమేక్ చిత్రాలు వద్దు అని మెగాస్టార్ ఫిక్స్ కాగా ఇప్పుడు పలు భారీ చిత్రాలని తాను ఒకే చేశారు. అయితే వీటిలో సెన్సేషనల్ హిట్ బింబిసార దర్శకుడు వసిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కించే సినిమా కూడా ఒకటి కాగా ఇది అయితే మెగాస్టార్ కెరీర్ లో 157వ సినిమాగా తెరకెక్కించనున్నారు.

మరి ఈ చిత్రం మళ్ళీ మెగాస్టార్ నుంచి ఓ అంజి రేంజ్ లో ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ని దింపనున్నారని ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదట.

విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై మరింత క్రేజీ రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ స్కేల్ లో అనౌన్స్ చేశారు. మరి ఇవన్నీ చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సినిమాగా ఇది మారుతుంది అనిపిస్తుంది.