మాస్ : అక్కడ RRR రికార్డు సమం చేసిన “గుంటూరు కారం”

తెలుగు సినిమా దగ్గర అపారమైన క్రేజ్ ఉన్నటువంటి హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా ఒకరు. కాగా మహేష్ కి ఒక్క సెక్షన్ అనే కాకుండా మాస్ క్లాస్ ఫామిలీ అందరిలో కూడా మంచి మార్కెట్ ఉండగా తనకి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ క్రేజ్ అయితే ఉంది.

కాగా ఈ క్రేజ్ తో మహేష్ సినిమాలకి యూఎస్ లో సాలిడ్ మార్కెట్ ఏర్పడగా ఈ మార్కెట్ తో తన సినిమాకి హిట్ టాక్ వస్తే ఈజీగా ఆ చిత్రం 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ క్రేజ్ తోనే తాను నటించిన తాజా చిత్రం “గుంటూరు కారం” కి యూఎస్ మార్కెట్ లో భారీ రిలీజ్ దక్కింది.

కాగా అక్కడ ఈ సినిమాకి ఇప్పుడు ఆల్ టైం రికార్డు ప్రీమియర్స్ పడబోతున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్ లు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా నుంచి టాలీవుడ్ సినిమా నుంచి ఉన్న చిత్రాల్లో సెన్సేసన్ల్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కి రికార్డు షోస్ 5 వేల 408 షోస్ పడగా ఇప్పుడు ఇదే రికార్డు నంబర్ షోస్ గుంటూరు కారం కి కూడా పడబోతున్నాయి.

మొన్న వచ్చిన సలార్ కి కూడా ఈ మార్క్ దక్కలేదు. దీనితో సింగిల్ లాంగ్వేజ్ లో సలార్ చిత్రం ఈ భారీ రికార్డు RRR తో సమం చేసేసింది. మరి ఈ రికార్డు రిలీజ్ లో గుంటూరు కారం ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో అనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కాగా ఈ అవైటెడ్ సినిమా వరల్డ్ వైడ్ గా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.