ఒక వారం రోజుల నుంచి గంగవ్వను అబ్జర్వ్ చేస్తున్నారా? మళ్లీ తనకు ఇంటి మీద ధ్యాస మళ్లింది. హౌస్ లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న గంగవ్వకు జ్వరం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఓ వారం రోజులు సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత మరో వారం రోజులు కుమ్మేసింది. బీభత్సంగా ఆటను ఆడేసింది. కానీ.. మళ్లీ ఇప్పుడు తనతోటి అయితలేదు. తను ఓ వారం పది రోజుల నుంచి అన్నం తినడం లేదు. తనకు అన్నం తినబుద్ధి కావడం లేదంటూ తోటి కంటెస్టెంట్లతో చెప్పింది. అఖిల్ తోనూ ఇంటికి వెళ్లిపోతానంటూ చెబుతోంది.
బిగ్ బాస్ కు కూడా తనకు సమయం దొరికినప్పుడు పంపించేయండంటూ కోరుతోంది. నా ఇల్లు ఏడబాయానో? నా పిల్లలు ఏడబాయెనో? అంటూ మనసులోనే ఏడ్చేస్తుంది. తనకు బిగ్ బాస్ ఇల్లు కట్టేసినట్టుగా ఉంది. దీంతో ఏం చేయలేని పరిస్థితి తనది. పోనీ.. తన వాళ్లతో ఫోన్ మాట్లాడిస్తే ఓకేనా నీకు అని కంటెస్టెంట్లు అడిగినా కూడా వద్దు.. నేను ఇంటికి పోత.. అంటోంది.
అయితే.. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే? గంగవ్వను ఎవ్వరూ నామినేట్ చేయరు. ఇంకా ఎన్ని రోజులు అయినా సరే.. ఎన్ని వారాలు గడిచినా సరే.. ఏ కంటెస్టెంట్ కూడా గంగవ్వను నామినేట్ చేయడానికి సాహసించరు. దీంతో తను నామినేషన్లలోకి వచ్చే చాన్సే లేదు. వచ్చినా ఎప్పుడో ఒకసారి వస్తుంది కావచ్చు. తను నామినేషన్లలోకి వచ్చినా తనను సేవ్ చేయడానికి ప్రేక్షకులు ఉన్నారు. దీంతో ఫైనల్స్ వరకు గంగవ్వ ఇంట్లో ఉండే అవకాశం ఉంది.
మరోవైపు గంగవ్వ ఫిజికల్ టాస్కులను చేయడం లేదు. కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా తను చేసిందేమీ లేదు. తన వయసు దృష్ట్యా తను ఏం చేయలేదు. ఒకవేళ గంగవ్వను పంపించకుండా అలాగే ఉంచితే ఫైనల్స్ వరకు గంగవ్వ చేరుకుంటుంది. అప్పుడు కప్పు విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే.. ఇక గంగవ్వను ఇంటికి పంపించేయాలని బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయిందట. ఎలాగూ ఈ వారం ఎవరో ఒకరు కంటెస్టెంట్ ను ఇంటికి పంపించాల్సిందే. నామినేషన్లలో ఉన్న ఎవరో ఒకరిని పంపించే బదులు.. గంగవ్వేనే ఎలిమినేట్ చేసి తనను ఇంటికి పంపించేయాలని అనుకుంటున్నారట. ఆదివారం రోజున గంగవ్వను స్టేజీ మీదికి పిలిచి వీడ్కోలు పలుకుతారు.. అనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చూద్దాం మరి.. నిజంగా గంగవ్వకు ఈ వారం విడుదల జరుగుతుందా? లేక ఇంకా గంగవ్వను ఆ ఇంట్లోనే ఉంచుతారా?