Gangavva: రాజకీయాలలోకి గంగవ్వ… వారిద్దరూ నాకు అన్నదమ్ములే… పదవే ముఖ్యమంటున్న గంగవ్వ!

Gangavva: ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటు ఉన్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న వారిలో గంగవ్వ ఒకరు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన జీవన శైలి గురించి వీడియోలు చేస్తూ గంగవ్వ ఆరు పదుల వయసులో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక గంగవ్వ రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తున్న గంగవ్వ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రాజకీయాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాజకీయాలలోకి రావాలని ఉందా? ఉంటే ఏ పార్టీలోకి వెళ్తారు? ఎలాంటి పదవికి పోటీ చేస్తారు? అనే ప్రశ్నలు ఈమెకు ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నకు గంగవ్వ సమాధానం చెబుతూ రాజకీయాలలోకి రావాలనే ఆలోచన నాకు కూడా ఉందని తెలిపారు. అది రేవంత్ రెడ్డి కోసమైనా కేటీఆర్ కోసమైనా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు వారిద్దరూ నాకు అన్నదమ్ములు లాంటివాళ్లే. వాళ్ళిద్దరూ రాజకీయాలలో చానా పెద్దోళ్ళు నేను చిన్నదాన్ని నాకు ఎలాంటి పని చెప్పినా చేయటానికి సిద్ధంగానే ఉన్నానని గంగవ్వ తెలిపారు. ఇలా రేవంత్ రెడ్డి పార్టీ కోసమైనా కేటీఆర్ పార్టీ కోసమైనా తాను పనిచేస్తానంటూ గంగవ్వ చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇంత వయసులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న గంగవ్వ సినిమాలు చేయడమే కాకుండా రాజకీయాలలో కూడా రావాలని ఆశ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఒక పార్టీ కోసం కాదు ఇద్దరిలో ఎవరి కోసమైనా పనిచేస్తానని చెబుతున్న గంగవ్వకు పార్టీ కంటే పదవే ముఖ్యమని తెలుస్తోంది అంటూ ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.