సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత ఎవరి ఫేమ్ ఎప్పుడు మారుతుందో.. ఎవరు ఊహించలేరు. యూట్యూబ్ ద్వారా చాలామంది మంచి గుర్తింపు పొంది బాగానే సంపాదిస్తున్నారు. ఆ కోవకు చెందిన గంగవ్వ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2016లో గంగవ్వ మై విలేజ్ షో కార్యక్రమం ద్వారా యూట్యూబ్లోకి ప్రవేశించింది. అందులో తన మాట తీరు.. నటన ద్వారా మంచి గుర్తింపు పొంది, యూట్యూబ్లో ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. ఇక గంగవ్వ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా కంటెస్టెంట్ గా అతిథి పాత్రలో హౌస్ లో ప్రవేశించి.. తన ఆట ద్వారా మంచి గుర్తింపు పొందింది.
గంగవ్వ 2019లో విడుదలైన మల్లేశం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. యస్ ఆర్ కళ్యాణ మండపం, రాజరాజ చోరా, లవ్ స్టోరీ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.
గంగవ్వ తెలంగాణ యాసలో చేసే కామెడీకి, ప్రేక్షకులు నవ్వకుండా ఉండడం చాలా కష్టం. అందుకే ఆమెకు ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. ఇక గంగవ్వ యూట్యూబ్ ద్వారా నెలకు అన్నీ ఖర్చులు పోగా దాదాపు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తుందట.
ఇక సినిమాల విషయానికి వస్తే సినిమాను బట్టి.. ఒకరోజు షూటింగ్ కు దాదాపుగా పదివేల వరకు పారితోషకం తీసుకుంటుందట. ఈ విషయం సోషల్ మీడియాలో చేరి వైరల్ గా మారింది. గంగవ్వ ఒక పల్లెటూరిలో వ్యవసాయ కూలీగా జీవనం సాగించేది యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యి సినిమా రంగంలోకి ప్రవేశించడం అంటే మామూలు విషయం కాదు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
గంగవ్వ 2020 సంవత్సరంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం నాడు మహిళా అచీవర్ అవార్డు పొందడం జరిగింది. గంగవ్వ ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో నటించడం జరిగింది.