అమితాబ్‌పై పోలీసు కేసు… ఆందోళ‌న‌లో అభిమానులు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఐదు ద‌శాబ్ధాలుగా సినీ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ వ‌స్తున్న ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. హీరోగాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లోను న‌టించిన అమితాబ్.. వివాదాల జోలికి ఎప్పుడు పోడు. కేవ‌లం వినోదం పంచ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకున్న ఆయ‌న ఆప‌ద‌లో ఉన్న వారికి త‌న వంతు సాయం చేస్తూ అభిమానుల గుండెల‌లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. ఇటీవ‌ల అమితాబ్ క‌రోనా బారిన ప‌డ‌గా, ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అభిమానులు, ప్ర‌ముఖులు ఎంత‌గానో ప్రార్ధించారు. ఎట్ట‌కేల‌కు క‌రోనాని జ‌యించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అమితాబ్ ప్ర‌స్తుతం కౌన్ బ‌నేగా క‌రోర్ ప‌తి సీజన్ 12కు హోస్ట్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు.

స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న కేబీసీ షో ప్ర‌స్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ షోలో అమితాబ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రశ్నను అడిగారని ల‌క్నోకు చెందిన వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.దీంతో కేబీసీ నిర్వాహ‌కుల‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌పై లక్నోలోని ఓ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు కావడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కేబీలో సినీ, రాజ‌కీయం,వినోదం, జీకే ఇలా అన్ని ర‌కాల ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు అమితాబ్. శుక్ర‌వారం నిర్వ‌హించిన ఎపిసోడ్‌లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీ పాల్గొనగా, అత‌నిని..
6,40,000 క్యాష్ ప్రైజ్‌కు గాను.. డిసెంబర్‌ 25వ తేదీ1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు అనే ప్రశ్న అడిగారు .కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా అడిగిన ఈ ప్ర‌శ్న‌కు అమితాబ్ నాలుగు ఆప్ష‌న్స్ ఇచ్చారు. అవి `ఎ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి` . వీటిలో కంటెస్టెంట్ ఓ ఆన్స‌ర్ చెప్పిన త‌ర్వాత అమితాబ్ .. `కుల వివక్ష, అస్పృశ్యతను పెంపొందించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టార`ని పేర్కొన్నారు అమితాబ్.

హిందువుల మ‌నోభావాల‌ని దెబ్బ‌తినేలా అమితాబ్ మాట్లాడార‌ని నెటిజన్స్ కూడా ఆయ‌న‌పై ట్రోలింగ్ మొద‌లు పెట్టారు. `కేబీసీ`ని కమ్యూనిస్టులు హైజాక్ చేశారంటూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వివాదం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మార‌గా, దీనిపై అమితాబ్ బ‌చ్చ‌న్ ఏమైన స్పందిస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు,