‎Amitabh Bachchan: కొడుకును ప్రశంసిస్తూ అలాంటి పోస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్.. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరంటూ!

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేసారు.

‎ఒక ఏడాదిలో ఐ వాంట్‌ టు టాక్‌, హౌస్‌ఫుల్‌ 5, కాళీధర్‌ లాపత వంటి మూడు విభిన్నమైన చిత్రాల్లో నటించాడు. ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఆ మూడు చిత్రాల్లో పాత్రలు పోషించారు. ఆయా చిత్రాల్లో నాకు ఎక్కడా కూడా అభిషేక్‌ బచ్చన్‌ కనిపించలేదు. కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది. ఈ రోజుల్లో ఇలా చూడటం ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక పాత్రను పూర్తిస్థాయిలో అంగీకరించి అద్భుతంగా నటించి నటుడిగా నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియజేశావు.

‎ఒక తండ్రిగా నా తనయుడిని ప్రశంసించడాన్ని ఎవరూ ఆపలేరు అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అభిషేక్ బచ్చన్ విషయానికి వస్తే.. బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ చాలా సినిమాలలో హీరోగా నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. కాగా అభిషేక్ బచ్చన్ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది.