Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కోసం వెతుకుతున్న డెన్మార్క్ మహిళ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే!

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ఆయనకున్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అమితాబ్ బచ్చన్. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో కమర్షియల్ యాడ్స్ లో నటించి ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేశారు. ఇప్పటికీ ఆయన చేసిన అడ్వర్టైజ్మెంట్లు మనకు టీవీలో ప్రసారమవుతూ ఉంటాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో డెన్మార్క్ కి చెందిన ఒక మహిళ అమితాబ్ బచ్చన్ గురించి వెతుకుతోంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నేటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఆ మహిళ చేసిన పోస్ట్‌లో భారత్‌కు చెందిన ఒక ప్రముఖ అప్పడాల బ్రాండ్‌ ను పొగడటమే కాకుండా, ఆ బ్రాండ్‌ ను ప్రమోట్ చేసిన వ్యక్తే ఆ అప్పడాల తయారీదారుడిగా భావించింది. ఫ్రెడెరిక్కె అనే డెన్మార్క్‌ కు చెందిన ఒక మహిళ తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సదురు మహిళ ఒక అప్పడాల ప్యాకెట్‌ ను చూపిస్తూ, ఆ ప్యాకెట్‌ పై అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడింది. ఈ బ్రాండ్‌ పై ఉన్న వ్యక్తి చేసే అప్పడాలు చాలా బాగుంటాయి. అవి అంటే నాకు చాలా ఇష్టం అని మహిళ చెప్పుకొచ్చింది.

తన దగ్గర ఉన్న అప్పడాలు అయిపోతున్నాయని, ఈ బ్రాండ్ అప్పడాలు ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలుసా? తెలుస్తే మీరైనా అనికి చెప్పండి తను చేసే అప్పడాలు చాలా బాగుంటాయని పేర్కొంది. ఈ అప్పడాలను తాను నేపాల్‌ లో కొన్నానని, కానీ ప్రస్తుతం డెన్‌మార్క్‌ లో ఇలాంటి అప్పడాలు ఎక్కడా దొరకడం లేదని ఆమె వివరించింది. ఈ లెజెండరీ అప్పడాల వ్యక్తి ఎవరో ఎవరికైనా తెలిస్తే దయచేసి సాయం చేయండి అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే అప్పడాల కవర్ పై ఉన్న అమితాబ్ బచ్చన్ ఎవరు అన్న విషయం ఆమెకు తెలియక ఆయన్ను అప్పడాల తయారీధారుడిగా భావించి మహిళ చేసిన పోస్ట్‌ ను ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ సరధాగా ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ను నటుడిడు అమితాబ్ బచ్చన్‌ను ట్యాగ్ చేస్తూ సర్, దయచేసి ఈ మహిళకు సహాయం చేయండి అని రాసుకొచ్చారు.