Amitabh Bachchan: అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ భారీగా ట్రెండ్ అవుతుంది. ఒకవైపు పుష్ప2 సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారు మోగుతూ ఉండగా మరోవైపు ఈయన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు కావడంతో ఈ వివాదంలో నిల్చొని ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాల పరంగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ పై విమర్శలు కురిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అల్లు అర్జున్ దూకుడు స్వభావమే ఇలా ఇండస్ట్రీకి ఇబ్బందులు తీసుకువచ్చిందని ఆయన ఇగో కారణంగానే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు మొత్తం సీఎం ముందు తలదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ అల్లు అర్జున్ ను పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ సైతం అల్లు అర్జున్ తో నన్ను పోల్చదండి అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అమితాబ్ ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఈయన చివరిగా కల్కి సినిమా ద్వారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల వద్దకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్న అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి అని కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కంటెస్టెంట్ పాల్గొన్నారు. అయితే ఆయన తాను అల్లు అర్జున్ అలాగే అమితాబ్ గారికి పెద్ద అభిమాని అని తెలిపారు. ఇలా ఆ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలపై అమితాబ్ స్పందించారు.అల్లు అర్జున్ ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి గొప్ప నటుడు. ఈ గుర్తింపుకు ఆయన అర్హుడు. తాను కూడా పుష్ప 2 తో అల్లు అర్జున్ కి వీరాభిమానిగా మారిపోయాను దయచేసి అలాంటి ఒక గొప్ప నటుడితో నన్ను పోల్చవద్దు అంటూ అమితాబ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.