Ram Charan: నా కెరియర్ లో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే…. అలా చేయకుండా ఉండాల్సింది?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాంచరణ్ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాప్ అబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో ప్రోమోలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా బాలకృష్ణ రామ్ చరణ్ ఫ్యామిలీ గురించి తన కూతురు భార్య గురించి అడిగి తెలుసుకున్నారు అదే విధంగా తన కెరియర్ గురించి కూడా ఎన్నో రకాల ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్లో సరిదిద్దుకోలేని చేసిన తప్పులను కూడా రామ్ చరణ్ ఈ సందర్భంగా బయటపెట్టారు.

తన సినీ కెరియర్లో చేసిన అతి పెద్ద తప్పు గురించి రాంచరణ్ మాట్లాడుతూ తాను అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ సినిమాని రీమేక్ చేసి తప్పు చేశానని చెప్పాడు. ఇక ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో చాలా రోజుల పాటు డిప్రెషన్ లో ఉండిపోయానని రామ్ చరణ్ తెలిపారు. జంజీర్ లాంటి ఒక క్లాసికల్ సినిమాని మళ్లీ రీమేక్ చేయాలనుకోవడం పెద్ద తప్పు కానీ రామ్ చరణ్ తనే స్వయంగా అలాంటి తప్పు చేసినందుకు రిగ్రేరేట్ అవుతున్నానని చెప్పడం విశేషం.

ఇలా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన ఈయన అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు .అలాగే రామ్ చరణ్ లుక్ పట్ల కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఏ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల కాలేదు కానీ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా తిరిగి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు..