ఇన్నాళ్ళకి “వకీల్ సాబ్” డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.!

Dil Raju gets 12 crore more profits from Vakeel Saab

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ విషయంలో అయితే మాస్ గా చూపించి సక్సెస్ అయ్యిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది “వకీల్ సాబ్” దర్శకుడు వేణు శ్రీరాం అని కూడా చెప్పాలి.

అయితే అంతకు ముందు కూడా మంచి సినిమాలు తాను చేసి హిట్స్ కొట్టగా ఈ సినిమా తర్వాత అయితే మళ్ళీ ఈ దర్శకుడు కనిపించలేదు. హిట్ కొట్టినప్పటికీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా దాదాపు స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. దీనితో 2020 నుంచి ఈ 2023 వరకు తన నెక్స్ట్ సినిమా ఏది అనేది ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే ఇప్పుడు మొత్తానికి వకీల్ సాబ్ తర్వాత ఈ దర్శకుడు మెగా ఫోన్ పట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాని గత వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజే నిర్మాణం వహించనున్నట్టుగా కూడా సినీ వర్గాల వారు చెప్తున్నారు. అయితే హీరో ఎవరు ఇతర డీటెయిల్స్ అనేవి ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి.

కాగా ఈ దర్శకుడు అయితే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఓ సినిమా కోసం బిజీ కాబోతున్నాడు. ఇక ఆ ఇతర వివరాలు ఎప్పుడు వస్తాయి అనేది కాలమే నిర్ణయించాలి. తాను పవన్ చేసిన వకీల్ సాబ్ సినిమానే తన కెరీర్ లో 85 కోట్లకి పైగా షేర్ ని అందుకొని తన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.