‎Dil Raju: పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Dil Raju: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల ఓజీ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇది ఇలా ఉంటే నిర్మాత దిల్ రాజు ఇప్పుడు మరో భారీ సినిమా స్కెచ్ వేశారు.

‎ఇప్పటికే పలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న దిల్ రాజు తాజాగా మరో స్టార్ హీరో డేట్స్ పట్టేశాడట. ఆ స్టార్ మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా రావడంతో ఆడియన్స్ కూడా ఓజీ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి సరైన కంటెంట్ పడితే ఎలా ఉంటుంది అనేది ఓజీ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పాలి. విడుదలైన వారం రోజుల్లోనే రూ.360 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఓజీ.

‎ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఓజీ సక్సెస్ తో దానికి ప్రీక్వెల్, సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు పవన్. ఈ రెండు సినిమాలే కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇదే అందరూ పవన్ లాస్ట్ మూవీ అనుకున్నారు. కానీ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి సర్ప్రైస్ ఇస్తూ మరో సినిమాకి కమిట్ అయ్యాడట పవన్. ఆ మూవీకీ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. డైరెక్టర్గా అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా వేణు శ్రీరామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.