మహేష్ ఆ డైరెక్టర్ కు ఎందుకు ఛాన్స్ ఇచ్చారా అని తలలు పట్టుకున్న ఫ్యాన్స్… కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్!

మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.ఇలా మహేష్ బాబు సినీ కెరియర్లో బ్లాక్ పోస్టర్ గా నిలిచిన సినిమాలలో ఒక్కడు సినిమా ఒకటి ఈ సినిమా 2003 సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ విడుదలైంది. ఈ సినిమాకి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్లో ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించగా గుణశేఖర్ దర్శకుడిగా అప్పటికే గుణశేఖర్ చిరంజీవితో మృగరాజు వంటి ఫ్లాప్ సినిమాని ఖాతాలో వేసుకున్నారు. మహేష్ బాబు కూడా రెండు డిజాస్టర్ సినిమాలో తర్వాత ఒక్కడు సినిమా చేశారు.

ఇక ఒక్కడు సినిమాకు పోటీగా ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. అప్పటికే ఆది స్టూడెంట్ నెంబర్ వన్ వడ్డీ బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి గుర్తింపు పొందారు ఇలా నాగ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఒక్కటి సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు.ఈ క్రమంలోనే మహేష్ బాబు అసలు ఎందుకో గుణశేఖర్ కి అవకాశం ఇచ్చాడు అని అభిమానులు తలలు పట్టుకున్నారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు షూటింగ్ జరుపుకున్నటువంటి ఒక్కడు సినిమా సంక్రాంతి బరిలో దిగింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక నటించారు .ఈ సినిమా సమయంలో తనకు చికెన్ ఫాక్స్ రావడం మొహంపై మచ్చలు ఏర్పడటంతో భూమికను హీరోయిన్గా ఎందుకు తీసుకున్నామా అనే ఆలోచనలో కూడా మహేష్ బాబు పడ్డారు.భారీ సెట్టింగ్లతో అధిక బడ్జెట్ కేటాయించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినా 2003 వ తేదీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారు. అప్పట్లో మహేష్ బాబు కెరియర్ లోనే ఇదే బ్లాక్ బస్టర్ చిత్రం కావడం విశేషం.