సోనూసూద్ అంతక ముందు సినిమాలలో క్యారెక్టర్ చేసే ఒక నటుడిగానే అందరికీ తెలుసు. అంతేకాదు సోనూసూద్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ వల్ల కొంత మంది ప్రేక్షకుల్లో విలన్ అన్న పేరు కూడా ఉంది. కాని ఎప్పుడైతే కరోనా సమయంలో వందల మంది ప్రజలను ఆదుకున్నాడు అప్పటి నుంచి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచాడు. గత ఏడాది నుంచి కష్టకాలంలో సోనూసూద్ చేసిన సాయం గురించి చెప్పడానికి మాటలు లేవు. చెప్పాలంటే సోనూసూద్ చేసిన సహాయం ఇంతవరకు ఎవరూ చేయలేదని చెప్పక తప్పదు. సోనూసూద్ కరోనా సమయంలో ఎంతోమంది జీవితాలను నిలబెట్టాడో ప్రత్యక్షంగా అందరూ చూశారు.
కష్టాలలో ఉన్న ప్రతీ ఒక్కరికీ నేనున్నా అని ధైర్యం ఇచ్చాడు. సినీ పరిశ్రమలో సోనూసూద్ ఎన్నో సినిమాలలో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. చాలా వరకు నెగెటివ్ రోల్ లో తన పాత్ర అందరికీ కోపం తెచ్చేలా ఉంటుంది. కానీ నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ ని చూసి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. సినిమాల్లో విలన్ గా ఉన్న సోనూసూద్. నిజ జీవితంలో మాత్రం కోట్ల మంది గుండెల్లో హీరో అయ్యాడు. అందుకే ఒక గ్రామంలో సోనూసూద్ కి ఏకంగా గుడి కట్టారు.
కాగా తాజాగా సోనూసూద్ కొన్ని విషయాల వెల్లడించాడు. కరోనా సమయంలో వలస కార్మికులు పడిన కష్టాలను చూసి తను చలించానని తెలిపాడు. అవన్నీ చూసి తట్టుకోలేక వారికి సహాయం చేయాలనిపించిందని చెప్పుకొచ్చాడు. వారికోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తనకు తెలిసిన కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాన్ని కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఒకప్పుడు సోనూసూద్ తల్లి చెప్పిన మాటలు గురించి తెలిపాడు. ఒకరికి సహాయం చేస్తే వారి నుంచి వచ్చే దీవెనలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని తెలిపిన అమ్మ మాటలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ స్పూర్తి తోనే ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాని వెల్లడించాడు.ప్రస్తుతం సోసూసూద్ చిరంజీవి – రాం చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.