Dragon Fruit: గర్భిణీ స్త్రీలు డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా.. వైద్య నిపుణుల ఏమంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

గర్భధారణ సమయంలో ఆహార విషయంలో జాగ్రత్తలు చాలా ముఖ్యం. తల్లీ శరీరం బలంగా ఉండాలి, బిడ్డ ఎదుగుదలకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందాలి. ఈ సందర్భంలో సహజంగానే వచ్చే పండ్లు మంచి ఆహార మిత్రులుగా మారతాయి. అయితే చాలా మందికి కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. గర్భం దాల్చిన స్త్రీ.. డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా లేదా..? ఈ ప్రశ్నకి ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి శక్తివంతమైన పండు అని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్, కాల్షియం, మగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ పండు సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.

తల్లి రక్తహీనతకు గురవ్వకుండా ఉండేందుకు డ్రాగన్ ఫ్రూట్‌లోని ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి బిడ్డకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు చేరేలా చేస్తుంది. అదనంగా డ్రాగన్ ఫ్రూట్‌లోని కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. ఇది తల్లీ బలాన్ని పెంచడమే కాకుండా, బిడ్డ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా అవసరం.

హార్మోన్ల మార్పుల కారణంగా గర్భిణీ స్త్రీలు అలెర్జీలు, జీర్ణ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ సహజ ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియ సులభం చేస్తుంది. గర్భధారణలో సాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాక, ఇందులోని సహజ తీపి చక్కెర స్థాయిలను ఎక్కువగా పెంచకుండా, శక్తిని అందిస్తుంది.

అయితే వైద్యులు సూచించేది ఒకటే.. దీనిని మితంగా తీసుకోవడం మంచిది. ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు లేదా అరుదుగా అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. డ్రాగన్ ఫ్రూట్‌ను స్మూతీగా, ఫ్రూట్ సలాడ్‌గా లేదా నేరుగా ముక్కలుగా తినొచ్చు. ఈ పండు తల్లికి శక్తినిచ్చి, బిడ్డ ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందించే అద్భుతమైన ఆహార భాగం అవుతుంది. చిన్న పండు వెనుక ఇంతటి ఆరోగ్య రహస్యాలు దాగి ఉండటం గర్భిణీ స్త్రీలకు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.

(Disclaimer: ఈ కథనంలోని సమాచారం సాధారణ ఆరోగ్య సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఏవైనా ఆహార మార్పులు చేయడానికి ముందు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.)