‘ఖుషీ’ కోసం రష్మికని లాక్కొస్తున్న విజయ్.?

అసలేమయ్యింది ‘ఖుషీ’ సినిమాకి.? శివ నిర్మాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ సినిమా ప్రస్తుతం సమంత కారణంగా పెద్ద ‘బ్రేక్’ తీసుకుంది. షూటింగ్ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

సినిమా అనూహ్యంగా లేట్ అవడంతో, బజ్ కాస్తా చల్లారిపోయింది. మళ్ళీ ఈ సినిమాకి బజ్ రావాలంటే ఎలా.? నిజానికి, ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా ఆశలే పెట్టుకున్నాడు. సినిమా సూపర్ హిట్ అవడం విజయ్‌కి తప్పనిసరి.

కానీ, సమంత ఇప్పట్లో ‘ఖుషీ’ సెట్స్ మీదకు వచ్చేలా లేదు. మరోపక్క, ఈ సినిమాకి బజ్ తెచ్చేందుకోసం రకరకాల ప్లాన్స్ వేస్తున్నారట. ఈ క్రమంలోనే రష్మిక మండన్న పేరు విజయ్ దేవరకొండ మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది.

ఓ స్పెషల్ సాంగ్ రష్మిక మీద డిజైన్ చేస్తే బావుంటుందని శివ నిర్వాణతో విజయ్ చర్చించాడట. రష్మికని కూడా ఈ మేరకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ గాసిప్ నిజమే అయితే మాత్రం ‘ఖుషీ’కి ఇది చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశముంటుంది.