Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ, #RT77 పవర్‌ఫుల్‌ టైటిల్ ‘ఇరుముడి’- అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ తన 77వ చిత్రం #RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టినరోజును సందర్భంగా, మేకర్స్ ఈరోజు ఈ చిత్రం టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు

ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌ ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఇది అయ్యప్ప స్వామి దీక్షని సూచిస్తోంది. అద్భుతమైన ఫస్ట్ లుక్‌లో రవితేజ సాంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపించారు. భక్తులతో నిండిన వేడుక ఊరేగింపులో, గొప్ప ఆనందోత్సాహాలతో కనిపించడం ఒక ట్రాన్స్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రవితేజ పాపని ఎత్తుకుని చిరునవ్వుతో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా రవితేజ తన ఆనందాన్ని షేర్ చేశారు “జీవితంలో సరైన సమయంలో కొన్ని కథలు మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథలో మళ్ళీ భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను, నమ్మకమే మార్గదర్శకంగా సాగుతున్నాను.🙏🏻 @ShivaNirvana, @MythriOfficial తో కలిసి #ఇరుముడి అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను 🤗స్వామియే శరణం అయ్యప్ప 🖤”

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. “#RT77 #ఇరుముడి 🕉️🙏🏼🔥 ‘ప్రతి భావోద్వేగం ఒక వేడుకే’ మాస్ మహారాజా @RaviTeja_offl గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ❤‍🔥 అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆయన Redemption ప్రారంభమవుతుంది… స్వామియే శరణం అయ్యప్పా ✨”

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి పనిచేయడంపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు: “ఒక అద్భుతమైన స్క్రిప్ట్…. ఖచ్చితంగా విజయం సాధించే సినిమా. దీని కోసం ఎదురుచూస్తున్నాను…. 🔥🔥🔥. కమర్షియల్ సినిమాలలో ఒక గేమ్ ఛేంజర్… 🔥🔥🔥 #RT177 … @ShivaNirvana సినిమా … మీరు @RaviTeja_offl సర్ కొత్త వెర్షన్‌ను చూడబోతున్నారు🔥🔥🔥 … దేవుడి ఆశీస్సులు ఉండాలి ❤️ @MythriOfficial”

దర్శకుడు శివ నిర్వాణ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది, రవితేజకు మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అవుతున్నారు.

ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రను పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర,స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటర్. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు రాశారు, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇరుముడి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

శ్రీకృష్ణదేవరాయల మిస్టరీ || Astrologer Amaram Naresh Babu About Sri Krishnadevarayalu Mistory || TR