Lata Mangeshkar: గానకోకిల లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో హిందీ పాటలను తన అద్భుతమైన గాత్రంతో పాడి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా భారత కోయిలగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లతమంగేష్కర్ గత ఏడాది కరోనా మహమ్మారి బారిన పడే ఆస్పత్రిలో చేరారు.ఈ విధంగా ఆస్పత్రిలో పోరాడుతూ ఉన్న ఈమె ఈ ఏడాది జనవరి నెలలో మృత్యువాతపడ్డారు. 30 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో రికార్డులను సృష్టించారు.
ఈ విధంగా చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర పెట్టుబడుల ద్వారా ఆమెకు ఆస్తులను భారీగా పోగు చేసినట్టు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం లతా మంగేష్కర్ నికర ఆస్తులు సుమారు 368 కోట్లు ఉంటాయని సమాచారం.కెరీర్ ప్రారంభంలో ఒక్కో పాటకు కేవలం 25 రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే లతామంగేష్కర్ తాను మరణించే సమయానికి కోట్లలో విలువైన ఆస్తులను సంపాదించారు.
ఈ విధంగా ముంబై లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో విలువైన కార్లు బంగళాలు అన్ని కలిపి ఈమెకు కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయి. మరి ఈమెకు పిల్లలు లేక పోవడంతో ఈ కోట్ల రూపాయల ఆస్తికి వారసులు ఎవరూ అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే లతామంగేష్కర్ కు తమ్ముడు చెల్లెలు ఉన్నారు. అయితే తన తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ కి తన ఆస్తులు దక్కనున్నాయని తనే కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అని వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.