Revanth Reddy: ఆ ఆశతోనే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తున్నా… దిల్ రాజును రేవంత్ కరుణించేనా?

Revanth Reddy: ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా చోటు చేసుకున్నటువంటి అంశంపై రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. దీంతో ఆయన అనూహ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇకపై తాను తెలంగాణలో ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు ఇవ్వను అదే విధంగా సినిమా టికెట్ల రేట్లు కూడా ఏ మాత్రం పెంచనని షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడారు కానీ ఆయన మాత్రం తన నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదని ఇచ్చిన మాట పైన నిలబడి ఉంటారని తెలిపారు. ఇలా తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లకూ బెనిఫిట్ షోలకు అనుమతి లేదని క్లారిటీ రావడంతో సినిమా ఇండస్ట్రీ వారి ఆశలన్నీ కూడా ఏపీపైనే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీలో దిల్ రాజు నిర్మాణంలో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకి భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచారు మొదటి రోజు ఏకంగా ఆరు షోలకు అనుమతి తెలిపారు.

ఇక తెలంగాణలో మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు అయితే తాజాగా మరోసారి దిల్ రాజు ఇదే విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారని తెలుస్తోంది. సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కూడా చాలా ముందు చూపుతో ఉన్నారు కాబట్టి ఒక నిర్మాతగా టికెట్ రేట్ల పెంపుపై తన ప్రయత్నం చేస్తానని ఆయన వెల్లడించారు. మరి టికెట్ల రేట్లు పెంచే విషయంలో దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇటీవల అల్లు అర్జున్ సినిమా విషయంలో చోటు చేసుకున్న ఘటన తర్వాత విడుదలవుతున్న అతిపెద్ద సినిమా ఇదే కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా హైదరాబాద్లో కాకుండా ఏపీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యవహార శైలి అలాగే ఉంటే చిత్ర పరిశ్రమ కూడా మెల్లిమెల్లిగా ఏపీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.