Bheemla Nayak: ఈ మధ్య కాలంలో జానపదకళాకారులకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు క్రమంలోనే పుష్ప సినిమా శ్రీవల్లి పాట ద్వారా ద్వారా ఎంతో మంది జానపద కళాకారిని తన అద్భుతమైన గాత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా మరో ఇద్దరు జానపద కళాకారులు వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోని 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ద్వారా ఉన్నఫలంగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా కిన్నెర మొగులయ్యకు ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.
ఇక అడవి తల్లి మాట అనే పాట ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు సింగర్ దుర్గవ్వ. సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా గుర్తింపు సంపాదించిందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఈ సినిమాలో పాట పాడే అవకాశం ఎలా వచ్చింది ఈ సినిమాలో పాట పాడినందుకు తనకు మొత్తంలో డబ్బు ఇచ్చారు అనే విషయాల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా దుర్గవ్వ మాట్లాడుతూ…సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి హిట్ అయ్యాయి. అది విని భీమ్లానాయక్‌లో పాట పాడే అవకాశాన్ని తనకు కల్పించారని ఈ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఇలా జానపద పాటల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ సినిమాలో కేవలం ఐదారు నిమిషాలలో ఈ పాట పాడి వెళ్లిపోయానని తెలిపారు. ఈ విధంగా పాట పాడిన తర్వాత తనకు పది వేల రూపాయలు పారితోషికం ఇచ్చారని మిగిలినది తన కూతురుకు ఇచ్చే పంపించారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సింగర్ దుర్గవ్వ వెల్లడించారు.