బన్నీ నటించిన అలా వైకుంఠపురంలో కనిపించిన ఆ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అలా వైకుంఠపురం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా కథపరంగా మాత్రమే కాకుండా మ్యూజికల్ హిట్ కూడా అయింది. ఇకపోతే ఈ సినిమాలో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఎంతో ఆకర్షణగా నిలబడింది.అయితే ఈ ఇంటిని చూసి మొదట్లో అందరూ సెట్ అని భావించారు అయితే నిజానికి అది సెట్ కాదని అది నిజమైన ఇల్లేనని వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమాలో చూపించిన ఈ ఇంటికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ ఇల్లు ఖరీదు తెలిసి ఎంతో మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఇంటి ఖరీదు ఎంత ఏంటి అనే విషయానికి వస్తే… అలా వైకుంఠపురం సినిమాలో చూపించిన ఇల్లు మరెవరిదో కాదు. ఈ ఇల్లు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్తది.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ ఇంటి సెట్ వేయాలని చెప్పడంతో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన రాధాకృష్ణకు ఈ ఇంటి యజమానులు బంధువులు కావడం విశేషం.

ఇక ప్రస్తుతం రచన చౌదరి తన భర్త ఇండియాలో లేకపోవడంతో ఈ ఇల్లు ఖాళీగా ఉండడం చేత రాధాకృష్ణ ఈ ఇంటిని చూపించడంతో త్రివిక్రమ్ ఈ ఇంటిని ఫైనల్ చేసేశారు. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో ఇంద్రభవనాన్ని తలపిస్తున్నటువంటి ఈ ఇల్లు ఖరీదు అక్షరాల 100 కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఇలా అన్ని హంగులతో ఈ ఇంటిని ఎంతో సుందరంగా తీర్చేదిద్దారు. ఇలా ఈ ఇంటి ఖరీదు తెలిసే ప్రస్తుతం ఎంతోమంది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఇంటి ముందు సీన్స్ కోసం త్రివిక్రమ్ అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 5 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సెట్ వేసి చిత్రీకరించారని తెలుస్తోంది