సూర్య ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సూర్య. ఈయనకు కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇక ఈయన సినిమాలు తెలుగులో కూడా పెద్ద ఎత్తున విడుదల కావడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబడతాయి. ఇకపోతే ఈయన ఒక ప్రముఖ దర్శకుడు కుమారుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన తండ్రి అంత పెద్ద దర్శకుడు అనే విషయం ఇండస్ట్రీలోకి వచ్చేవరకు తెలియదని తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సూర్య తాను 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తన డిగ్రీ చదివిన పూర్తి చేసి ఏం చేయాలని ఆలోచిస్తున్నా సమయంలో ఒక మూడు నెలల పాటు బట్టల దుకాణంలో పనిచేశానని తెలిపారు.ఇలా బట్టల దుకాణంలో రోజుకు 18 గంటల పాటు ఎంతో కష్టపడే వాడినని ఇలా కష్టపడుతూ నెలకు 736 రూపాయల జీతం తీసుకున్నానని సూర్య వెల్లడించారు. ఇదే నా మొదటి సంపాదన అంటూ సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనంతరం నటనపై ఆసక్తితో అవకాశాలను వెతుక్కుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన తండ్రి ఒక దర్శకుడు అనే విషయం తనకు తెలిసిందని సూర్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సూర్య తాను సంపాదించిన మొదటి జీతంతో తన సోదరికి తన తల్లికి చీరలను బహుమతిగా ఇచ్చారని తెలియజేశారు. ఇలా స్వసక్తితో నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన 68వ జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.