సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత స్థాయికి ఎదిగి ఒదిగి ఉండే మనస్తత్వమున్న మంచి వ్యక్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ సూపర్ స్టార్ గా ,నట చక్రవర్తిగా చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక వ్యక్తి కృష్ణ. తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ 1965 సంవత్సరంలో విడుదలైన తేనెమనసులు సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దాదాపు 50 సంవత్సరాల పాటు 300 పైగా చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా రికార్డును నమోదు చేశాడు.కృష్ణ గారు నటన మీద ఆసక్తితో రోజుకు 18 గంటల పాటు సినిమా షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయని అలనాటి సినీత ప్రముఖులు చెబుతుంటారు.
సూపర్ స్టార్ కృష్ణ తొలి సినిమా తేనె మనసులు సినిమాకు 2000 రూపాయలు పారితోషికం తీసుకున్నారని అనేక సందర్భాల్లో కృష్ణ గారే స్వయంగా తెలియజేశారు.కృష్ణ గారు అత్యధిక పారితోషికం 25 లక్షల రూపాయలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ తాజాగా అలనాటి జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే కృష్ణ గారి వ్యక్తిత్వం గురించి సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను కూడా తెలియజేశారు.రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడం ద్వారా నిర్మాతపై భారం తగ్గుతుందని కృష్ణ గారు భావించి స్టార్ అయినప్పటికీ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిని తెలియజేశారు.కృష్ణ గారిపై అభిమానంతో కొంతమంది నిర్మాతలు 50 లక్షలు
రెమ్యునరేషన్ ఇచ్చినా నిర్మాతల నుంచి ఆయన అడిగి తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ పాతిక లక్షల రూపాయలు అని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కృష్ణ గారి గొప్ప వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు.
కృష్ణ గారికి ఏసుప్రభు జీవిత కథలో నటించాలని కోరిక ఉండేదని ఒక సినిమాలో ఏసుప్రభు గెటప్ లో నటించడం వల్ల తన కోరికను తీర్చుకున్నారు. కృష్ణ గారికి విజయనిర్మల గారికి మధ్య విడదీయరాని అనుబంధం ఉండేదని విజయనిర్మల మరణం అనంతరం కృష్ణ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలోనే కొడుకు రమేష్ మరణం ఆయనను మరింత బాధ పెట్టిందని నట్టి కుమార్ వెల్లడించారు.
విజయనిర్మల, రమేష్ బాబు జీవించి ఉంటే కృష్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉండి మరికొన్ని సంవత్సరాలు జీవించేవారని నిర్మాత నటి కుమార్ తన ఆవేదనను వ్యక్తపరిచారు.