పుష్పటు రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ ఘటనలో తల్లి రేవతి మరణించగా కుమారుడు శ్రీ తేజ్ మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురై ఆ రోజు నుంచి హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ మధ్యనే అల్లు అరవింద్ శ్రీ తేజ్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళాడు. శ్రీ తేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పాడు.
ఇప్పుడు తాజాగా డైరెక్టర్ సుకుమార్ హాస్పిటల్లో ఉన్న శ్రీ తేజ్ ని పరామర్శించడానికి వెళ్ళాడు. సుకుమార్ హాస్పిటల్ కి వెళ్ళటానికి ముందే సంఘటన జరిగిన నాలుగు రోజులకే అంటే జనవరి 9న శ్రీ తేజ్ తండ్రికి తన భార్య ద్వారా ఐదు లక్షల సహాయాన్ని అందజేశాడు. అంతేకాకుండా భవిష్యత్తులో అతని కుటుంబానికి అన్ని విధాల సాయం అందిస్తానని చెప్పుకొచ్చాడు సుకుమార్. అయితే అల్లు అర్జున్ ఇంతకుముందే శ్రీ తేజ్ కుటుంబానికి పాతిక లక్షలు ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చాడు.
అంతేకాకుండా హాస్పిటల్ ఖర్చులు తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడాతన వంతు సాయం పూర్తిగా ఉంటుందని చెప్పాడు. బాలుడిని చూడటానికి వెళ్లాలని ఉన్నా సెక్యూరిటీ కారణాల వలన, కోర్టు కేసుల హడావుడి వలన చూడటానికి వెళ్లలేకపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అతడిని పలకరించడానికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో పలు విమర్శలు తలెత్తాయి.
కాసేపు జైల్లో ఉండి వచ్చినందుకే అంతగా ఇదైపోతున్నారు,మరి ప్రాణాలు కోల్పోయిన తల్లి రేవతి గురించి గాని, హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న పిల్లవాడి గురించి గాని ఎవరు ఆలోచించరా అని టాలీవుడ్ సెలబ్రిటీస్ పై సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. ఈ నెగిటివిటీని పోగొట్టుకోవడానికా అన్నట్లు సుకుమార్, అల్లు అరవింద్ శ్రీతేజ్ ని పరామర్శించడానికి వెళ్ళారనే విమర్శలు వినబడుతున్నాయి. మరి దీనిపై అల్లు ఫ్యామిలీ, సుకుమార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.