AP: ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్న పుష్ప 2 డైలాగ్… సీరియస్ అయిన సీఎం చంద్రబాబు!

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతుంది. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను పట్టుకుని హంగామా చేశారు అయితే ఇందులో అభిమాని ఏకంగా పుష్ప సినిమాలోని గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతాము అంటూ ఫ్లెక్సీలను పట్టుకుని కనిపించారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నరుకుతామని ఫ్లెక్సీలు కనిపించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ అవుతూ ఆ ఫ్లెక్సీ పట్టుకున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పర్యటన అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమా డైలాగులు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా  ఈ సినిమాలోని ఇదే డైలాగులు మరోసారి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడంతో సంచలనగా మారింది.

ఇకపోతే జగన్ పర్యటనలో ఈ ఫ్లెక్సీ పట్టుకున్నటువంటి వ్యక్తి వైసిపి కార్యకర్త కాదని టిడిపి కార్యకర్త అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది .ఆయన తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం తెలుగుదేశం పార్టీ నేతలతో దిగిన ఫోటోలు కూడా బయటకు రావడంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని బయటపడింది. అయితే ఈ డైలాగు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. రప్ప రప్ప అంటూ ఎవరిని నరుకుతారు? ప్రజలనా అంటూ చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి అల్లు అర్జున్ సినిమాలోని డైలాగ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిందని చెప్పాలి.