కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్లో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో ధనుష్ మొదటి స్థానంలో ఉన్నాడు. చూడటానికి హీరో పర్సనాలిటీ లేకపోయినా ధనుష్ తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఇంతకాలం కోలీవుడ్ కి పరిమితమైన ధనుష్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ అనే సినిమా ద్వారా మొట్టమొదటిసారిగా తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ధనుష్ నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడంతో టాలీవుడ్ లో కూడా ధనుష్ కి మంచి గుర్తింపు లభించింది. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా ధనుష్ తన పదహారేళ్ళ వయసులో 2002వ సంవత్సరంలో తన తండ్రి కస్తూరి రాజా రూపొందించిన `తుల్లువదో ఇళ్లమై` అనే సినిమాతో హీరోగా ధనుష్ తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన అన్న సెల్వ రాఘవన్ రూపొందించిన కొండెయిన్ అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ధనుష్ కు హీరోగా మంచి పేరొచ్చింది. మొదట ధనుష్ ని హీరోగా పనికిరావని ఎగతాళి చేసిన వారికి ధనుష్ తన విజయం తో సమాధానం చెప్పాడు. హీరో అవటానికి శరీరం, రంగు ముఖ్యం కాదని టాలెంట్ ఉంటే చాలని నిరూపించాడు.
ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తన సినీ జీవిత ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో నేను హీరోగా పనికిరాననీ ఎంతోమంది ఎగతాళి చేశారని ధనుష్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నాలో ఉన్న మంచి నటనను బయటికి రాబట్టేందుకు డైరక్టర్ గా ఉన్న తన అన్న సెల్వ రాఘవన్ కొట్టేవాడని ధనుష్ చెప్పుకొచ్చారు. నాలో ఉన్న నటన బయటికి తీసుకురావటానికి ఆ రోజు మా అన్న కొట్టడం వల్లే ఇప్పుడు నా నటనను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ధనుష్ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ సామరస్యంగా వెళ్లిపోయారని ఇప్పటికి వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సార్ అనే సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. అంతేకాకుండా హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు ధనుష్.